Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ అంత నిడివి అయితే ఎలా..?

బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి  (Bobby) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) . ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) , ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) , చాందినీ చౌదరి (Chandini Chowdary) వంటి హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ఓ కొత్త సమస్య వచ్చి పడినట్లు తెలుస్తుంది.

Daaku Maharaaj

విషయంలోకి వెళితే.. ‘డాకు మహారాజ్’ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. గ్లింప్స్ కోసం ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అందులో క్యూ అండ్ ఏ జరిగింది. కానీ పబ్లిసిటీకి కావలసిన మెటీరియల్ అయితే దాని ద్వారా రాలేదు. మరోపక్క సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా నెల రోజులు కూడా లేదు. ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా చాలా లేటుగా రిలీజ్ అవుతుంది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘డాకు మహారాజ్’ ఫస్ట్ కాపీ అయితే రెడీ అయిపోయిందట.

అయినప్పటికీ మరింతగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రన్ టైం చాలా క్రిస్ప్ గా ఉండేలా చేసుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డాకు మహారాజ్’ రన్ టైం 165 నిమిషాలు వచ్చిందట. అంటే 2 గంటల 45 నిమిషాలు అనమాట. కథ డిమాండ్ మేరకు ఇంత నిడివి అవసరం అవుతుందని వినికిడి. అయితే సంక్రాంతి సినిమాలకి ఎంత తక్కువ రన్ టైం ఉంటే అంత మంచిది. అవసరమైతే పండుగ రోజుల్లో ఒకే రోజు రెండు సినిమాలు చేసేస్తారు ఆడియన్స్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus