Kanguva: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా కంగా.. ఇప్పుడెందుకు?

‘కంగువా’ (Kanguva) .. సూర్య (Suriya) నటించిన బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా కోసం అతను దాదాపు 3 ఏళ్ళు కష్టపడ్డాడు. గత గురువారం అంటే నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా రూ.1000 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేస్తుందని, కోలీవుడ్ నుండి ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోగా సూర్య నిలుస్తాడని అంతా భావించారు.

Kanguva

పాన్ ఇండియా వైడ్ సూర్యకి మార్కెట్ ఏర్పడటం కూడా ఖాయం అని అనుకున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja)   అయితే ‘ కంగువా సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది’ అంటూ అత్యాశకి పోయాడు. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్లు(షేర్) కలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేకుండా పోయింది. తెలుగులోనే కాకుండా తమిళనాడులో కూడా ‘కంగువా’ ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు.

ముఖ్యంగా ‘కంగువా’ సౌండ్ మిక్సింగ్ లో చాలా ప్రాబ్లమ్ ఉంది. నిర్మాత స్వయంగా దీనిని అంగీకరించడం జరిగింది. ఇప్పుడు సౌండ్ ని మార్చబోతున్నారట. అలాగే 12 నిమిషాల పాటు ఫుటేజీని ట్రిమ్ చేయబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో చాలా క్రింజ్ ఉంది అనే కామెంట్స్ ఉన్నాయి. ఆ పోర్షన్ ను కొంతవరకు ట్రిమ్ చేయనున్నారట.

అలాగే సెకండాఫ్ లో ల్యాగ్ ఉన్న సన్నివేశాలని కూడా ట్రిమ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీకెండ్ ముగిశాక.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక ఇప్పుడు ట్రిమ్ చేసినా కలిసొచ్చేది ఏమీ ఉండదు. మరి నిర్మాతల ఆలోచన ఎలా ఉందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus