కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్లుగా రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్.ఎక్స్.100’. ఈ చిత్రాన్ని ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించాడు. 2018వ సంవత్సరం జూలై 18న ఎటువంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదలైంది. రివ్యూలు కూడా సో సోగానే వచ్చాయి. కానీ చేతన్ భరద్వాజ్ సంగీతంలో రూపొందిన పాటలు.. అలాగే హీరోయిన్ అందాల ఆరబోతతో కూడిన ట్రైలర్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయని చెప్పొచ్చు. దానికి తోడు సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్.. జనాలను సర్ప్రైజ్ చేసి సంతృప్తి చెందేలా చేసింది. దాంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 3 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
5.40 cr
సీడెడ్
1.40 cr
ఉత్తరాంధ్ర
1.60 cr
ఈస్ట్
0.90 cr
వెస్ట్
0.70 cr
గుంటూరు
0.70 cr
కృష్ణా
0.70 cr
నెల్లూరు
0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
11.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.60 cr
ఓవర్సీస్
0.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
12.83 cr
‘ఆర్..ఎక్స్.100’ చిత్రానికి కేవలం రూ.12.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.12.83 కోట్ల షేర్ ను రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ.10.33 కోట్ల లాభాలు అంటే 5 రెట్లు లాభాలను అందించింది ఈ చిత్రం.