యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ గా ఎదిగారు. మనదేశంలోని ప్రతి సినీ పరిశ్రమ ప్రభాస్ ని తమ హీరోగా డిసైడ్ అయింది. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాని ఏకకాలంలో మూడు భాషల్లో రోపొందిస్తున్నారు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం దుబాయి లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, ప్రభాస్ పై భారీ యాక్షన్ సీన్ ని షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకమునుపే బిజినెస్ చకచకా జరిగిపోతోంది.
యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్లతో నిర్మిస్తున్న సాహో శాటిలైట్ హక్కులతో బడ్జెట్ ని రాబట్టేలా ఉంది. రీసెంట్ గా సాహో హిందీ, తమిళ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడానికి 210 కోట్ల ఆఫర్ వచ్చిందని తెలిసింది. అలాగే తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా 50 కోట్లపైనే అమ్ముడుపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ ఇంత పలుకుతుంటే థియేటర్ రైట్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతమందిస్తున్న సాహో పై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది.