పొరుగు దేశంలో 150 రోజులు ఆడిన సాహో..!

  • September 2, 2020 / 10:58 AM IST

ఇండియాలో ఏ స్టార్ కి అందనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. పరాయి దేశంలో ప్రభాస్ సాహో ఏకంగా 150రోజు ఆడింది. కొన్ని నెలల క్రితం సాహో జపాన్ భాషలో డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ ప్రేక్షకులకు సాహో తెగ నచ్చేసింది. ఇప్పటికే జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా సాహో రికార్డు నెలకొల్పింది. అలాగే సాహో మూవీ జపాన్ లో 150 రోజుల రన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. లాక్ డౌన్ సమయంలో కొన్ని రోజులు థియేటర్స్ బంధ్ కావడం జరిగింది.

అలా సాహో ప్రదర్శనకు మధ్యలో బ్రేక్ పడింది. జపాన్ లో వైరస్ వ్యాప్తిగా అంతగా లేని కారణంగా థియేటర్స్ పునఃప్రారంభం అయ్యాయి. బంధ్ లో ఉన్న దినాలను మినహాయించిన తరువాత మొత్తంగా సాహో 150రోజుల రన్ పూర్తి చేసి సత్తా చాటింది. బాహుబలి మూవీ జపాన్ లో భారీ విజయం అందుకోగా ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ప్రభాస్ నుండి వచ్చిన సాహో చిత్రాన్ని కూడా అక్కడ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు.

ఇండియాలో సాహో మిశ్రమ ఫలితాలు అందుకుంది. హిందీలో 150 కోట్లకు పైగా వసూళ్లతో హిట్ మూవీగా నిల్చింది. సౌత్ ఇండియాలో మాత్రం ఈ మూవీ నష్టాలు మిగిల్చింది. టాక్ ఎలా ఉన్నా, అన్ని భాషలలో 420కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించి చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus