‘బాహుబలి’ (సిరీస్) తరువాత ప్రభాస్ నుండీ వచ్చిన చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ‘సాహో’ వల్ల ప్రభాస్ క్రేజ్ తో నిర్మాతలు లాభాల బాట పట్టినా.. బయ్యర్స్ మాత్రం భారీగా నష్టపోయారు. ఇంత భారీ ప్రాజెక్టుని కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న కుర్ర దర్శకుడి పై పెట్టడంతో.. అతను హ్యాండిల్ చెయ్యలేకపోయాడు. ‘సాహో’ తరువాత అతని నుండీ మరో సినిమా రాలేదు. చిరంజీవితో ‘లూసీఫర్’ రీమేక్ చేస్తాడని ప్రచారం జరిగింది.
చిరంజీవి కూడా ఇది నిజమే అని స్పష్టం చేశారు. కానీ తరువాత ఆయన సుజీత్ ను తప్పించారు. అటు తరువాత ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లోనే హీరో గోపీచంద్ తో సుజీత్ ఓ చిత్రం తెరకెక్కిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పడిపోయింది. ఇదిలా ఉండగా.. ‘సాహో’ రిలీజ్ టైములో ‘దీనికి సీక్వెల్ ఉంటుంది. అది కూడా హిట్టయితే చేస్తాను’ అని ప్రభాస్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో కూడా లాస్ట్ సీన్లో ఆ హింట్ ఇచ్చారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ‘సాహో2’ షూటింగ్ కూడా ఆ టైంలోనే రూ.50శాతం వరకూ ఫినిష్ అయిపోయిందట.
కానీ ఫస్ట్ పార్ట్ ఫలితం తేడా కొట్టడంతో నిర్మాతలు ఆ టైములో ఈ సీక్వెల్ ఆలోచనలు పెట్టుకోలేదని తెలుస్తుంది. అయితే దీనిని కంప్లీట్ చేసి బాలీవుడ్లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచన నిర్మాతలకు ఉందట. అక్కడ ‘సాహో’ సూపర్ హిట్ అయ్యింది. పైగా ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. దాంతో ‘సాహో2’ ని కంప్లీట్ చేసి మొదట బాలీవుడ్లో విడుదల చెస్తే వర్కౌట్ అవుతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోయి.. బాలీవుడ్ మార్కెట్ కోలుకునేంతవరకూ ఇది కష్టమే..!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!