Kamal Haasan, Sruthi Haasan: కమల్‌ హాసన్‌ – శ్రుతి హాసన్‌ సినిమా మళ్లీ పట్టాలపైకి!

నాలుగు రోజులు వేటకు వెళ్లకుండా ఓ సింహం కూర్చుంది అంటే అలసిపోయినట్లో, ఆగిపోయినట్లో కాదు అంటుంటారు. సినిమా పరిశ్రమలో అలాంటి సింహం కమల్‌ హాసన్‌. గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్‌ సక్సెస్‌ లేని కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’తో అన్‌బిలీవబుల్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు అని చెప్పొచ్చు. కమర్షియల్‌ సినిమాల్లో కమల్‌ కమర్షియల్‌ సినిమాలు వేరయా అంటుంటారు. అలాగే ‘విక్రమ్‌’ కూడా అంతే స్థాయిలో అదరగొట్టింది. దీంతో కమల్‌ లోపల దాచేసుకున్న ఓ సినిమాను బయటకు తీసుకొస్తున్నారు.

‘విక్రమ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా కమల్‌ హాసన్‌ తొలి రోజుల్లో మాట్లాడినప్పుడు అందరూ ‘ఇండియన్‌ 2’ గురించే అడిగారు. శంకర్‌ ఆ సినిమా చేస్తారా, లేక మీరే చేస్తారా అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు. అయితే చాలామంది మరచిపోయిన సినిమా ‘శభాష్‌ నాయుడు’. ‘దశావతారం’ సినిమాలో పోలీస్ అధికారిగా బలరాం నాాయుడు కనిపిస్తాడు. ఆ పాత్రను ప్రధానంగా తీసుకొని కమల్‌ హాసన్‌ అప్పట్లో ‘శభాష్ నాయుడు’ అనే సినిమాను అనౌన్స్‌ చేశారు.

శ్రుతి హాసన్, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తారని తెలిపారు. కొంత చిత్రీకరణ కూడా జరిగింది. యుఎస్‌లో ఒక షెడ్యూల్ చిత్రీకరించారు. ఆ సమయంలో కథ విషయలో సమస్యలు వచ్చి దర్శకుడు తప్పుకోవడం, ఆ వెంటనే కమల్‌ వరుసగా వేరే సినిమాలు ఓకే చెప్పడం, రాజకీయాల్లోకి రావడం లాంటి కారణాలతో అప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు కమల్‌ మళ్లీ ‘శభాష్‌ నాయుడు’ని బయటకు తీసుకొస్తారట. త్వరలో సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.

బడ్జెట్ తక్కువే కావడం, స్క్రిప్టు సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారట. రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు సినిమాను శంకర్‌ పూర్తి చేసే లోపు ఈ సినిమాను పూర్తి చేసేయాలని కమల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. మరి అప్పటి కథనే తీసుకుంటారా, ఇప్పటికి తగ్గట్టుగా మార్పులు ఏమైనా చేస్తారా అనేది చూడాలి. బలరామ్‌ నాయుడు ‘దశావతారం’ సినిమాలో కనిపిస్తేనే నవ్వులు పూస్తాయి. అలాంటిది మొత్తం సినిమా ఆయన మీదే అంటే.. ఇక నవ్వులే నవ్వులు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus