అనిరుధ్ రవిచందర్ పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియా లెవెల్లో ఇతను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అప్పటివరకు టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఏ.ఆర్.రెహమాన్, హారిస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ పక్కకు నెట్టి.. టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. అనిరుధ్ ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.18 కోట్ల చొప్పున భారీ పారితోషికం అందుకుంటున్నాడు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు అంటే ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడవుతోంది. అలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా కూడా అనిరుధ్ కి ఉంది.
Sai Abhyankkar
‘దేవర’ వంటి యావరేజ్ కంటెంట్ సినిమాని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. కాకపోతే అనిరుధ్ తో దర్శక నిర్మాతలకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. అనిరుధ్ వాళ్లకి అందుబాటులో ఉండడు. అందువల్ల సకాలంలో ఆర్.ఆర్ కంప్లీట్ అవ్వక.. రిలీజ్ డేట్లు వాయిదా పడుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు ఫిలిం మేకర్స్ ను అనిరుధ్ తక్కువ చేసి చూస్తుంటాడు, వెంటనే సినిమా ఓకే చేయడు అని కూడా అంటుంటారు. అనిరుధ్ ను కాదని తమన్ వంటి వాళ్ళతో మ్యూజిక్ చేయించుకుందాం అనుకుంటే.. వాళ్ళు ఖాళీగా ఉండటం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో సాయి అభ్యంకర్ రూపంలో తెలుగు ఫిలిం మేకర్స్ కి మంచి ఆల్టర్నేట్ ఆప్షన్ దొరికినట్టు అయ్యింది. ‘డ్యూడ్’ సినిమా సాయి అభ్యంకర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను తెలుగులో పాట పాడిన విధానం ముచ్చటగా అనిపించింది.ప్రస్తుతం అల్లు అర్జున్ – అట్లీ సినిమాకి కూడా అతను సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. సో అనిరుధ్ కి ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకునే ఫిలిం మేకర్స్ కి ఇతను బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.