సినిమాలలో తండ్రి పాత్రలు అనగానే కేవలం కొందరు నటులు మాత్రమే గుర్తుకు వస్తారు. అలాంటి వారిలో నటుడు సాయిచంద్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే నేడు ఫాదర్స్ డే కావడంతో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాలో సాయి పల్లవికి తండ్రి పాత్రలో నటించారు. తాజాగా విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి తండ్రి పాత్రలో సాయి చంద్ నటించారు.
ఇలా తండ్రి పాత్రలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మాట్లాడుతూ తను సాయి పల్లవికి తప్ప ఇతరులకు తండ్రిగా నటించలేక పోయానని తెలిపారు. ఈ క్రమంలోనే ఫిదా సినిమాలో సాయిపల్లవి శరణ్య ఇద్దరూ కూడా ఇప్పటికి తనని నాన్నా అంటూ పలకరిస్తారని, మా మధ్య ఉన్న బంధం తెరపై కనిపించే బంధానికి మించినదని సాయి చంద్ తెలిపారు. ఇలా తండ్రి పాత్రలో ఎంతగానో నటించి అందరిని మెప్పించిన ఈయన నిజ జీవితంలో మాత్రం తండ్రి కాలేకపోయారు.
ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నారు. తనది ఉమ్మడి కుటుంబం అని ఇంట్లో అన్నయ్యలు పెదనాన్న పిల్లలు అక్కయ్య పిల్లలు ఉండటం వల్ల తనకంటూ ఒక సొంత కుటుంబం లేదు అనే భావన మనలో ఎప్పుడూ కలగలేదు అందుకే తాను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమాలు తనకు ఆన్ స్క్రీన్ కూతుళ్లను ఇవ్వగా, ఆఫ్ స్క్రీన్ లో కూడా తను ఆ బంధాలను కొనసాగిస్తున్నారని సాయిచంద్ తెలిపారు.
ఇప్పటికీ సాయిపల్లవి తనని నాన్న అని పిలుస్తూ ఉంటారని ఆయన తెలిపారు. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఫిదా సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తల్లి లేని పిల్లలకు తండ్రిగా గొప్పగా నటించాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!