Sai Dharam Tej: ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌కు గురించి సాయితేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

పవన్‌ కల్యాణ్‌ను కొత్త కథలో చూడాలని అభిమానులు అనుకుంటూ ఉంటారు. అంటే రీమేక్‌ సినిమాలు పవన్‌ చేయడం వారికి ఇష్టం ఉండదు. అయితే అలాంటి రీమేక్‌తోనే పవన్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టి ఉండటం వేరే విషయం అనుకోండి. ఇక విషయానికొస్తే ఇదే ప్రశ్న సాయి ధరమ్‌ తేజ్‌ దగ్గరకు వచ్చింది. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ వరకూ వెళ్లిందట. ఈ ఇద్దరూ కలసి ‘వినోదాయ చిత్తాం’ అనే తమిళ సినిమా రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించే ఈ చర్చంతా. కొత్త సినిమా చేయొచ్చు కదా అనేదే ఆ మాట.

#PKSDT వర్కింగ్‌ టైటిల్‌తో ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ ఇటీవల ప్రారంభమైంది. పవన్‌ తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు కూడా. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్‌ కూడా బయటకు వచ్చాయి. వాటి పట్ల ఫ్యాన్స్‌ హ్యాపీ కానీ.. స్ట్రెయిట్‌ తెలుగు మాస్‌ సినిమా చేయాల్సింది అనేది వారి కోరిక. ఈ వాఖ్యలపై సాయి ధరమ్‌ తేజ్‌ స్పందించారు. తన తాజా సినిమా ‘విరూపాక్ష’ ప్రచారంలో భాగంగా సాయితేజ్‌ ఈ మేరకు కొన్ని కామెంట్స్‌ చేశారు.

‘‘పవన్‌, మీరు కలసి ఒరిజినల్‌ సినిమా చేస్తే బాగుంటుంది కదా’ అని అంటున్నారు. అయితే సినిమా రీమేకా? కాదా? అనే విషయాల్ని పక్కనపెడితే.. నన్ను పెంచిన వ్యక్తితో కలసి నటించే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నా. అది నా డ్రీమ్‌ కూడా. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అలాంటి ఛాన్స్‌ నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి. అయితే ‘ఈ సినిమా ఎందుకు? ఆ సినిమా ఎందుకు?’ అని కొందరు అంటున్నారు.

అవేవీ నేను పట్టించుకోను అని తేల్చేశాడు (Sai Dharam Tej) సాయితేజ్‌. అయితే మేం చేస్తున్న కథకు.. మాతృక సినిమా ‘వినోదాయ చిత్తాం’ కథకు సంబంధం లేదు. సోల్‌ మాత్రమే తీసుకుని ఈ కథను సిద్ధం చేశారు పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశారు. , మా కాంబినేషన్‌కు తగ్గట్టుగా సన్నివేశాలు సిద్ధం చేసుకున్నారు అని సాయితేజ్‌ క్లారిటీ ఇచ్చారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus