Nara Rohit: నారా రోహిత్ ను ‘ఓజి’ అప్డేట్ అడిగిన తేజు.. మేటర్ ఏంటి..!
- May 29, 2025 / 11:45 AM ISTByPhani Kumar
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజి’ (OG Movie)సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఓ కీలక షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 25న ‘ఓజి’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంతకు మించి చిత్ర బృందం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అయితే ‘భైరవం’ టీం నుండి ఒక అప్డేట్ అందింది.
Nara Rohit

విషయం ఏంటంటే.. ‘భైరవం’ (Bhairavam) సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఈ సినిమాలోని హీరోలైన నారా రోహిత్(Nara Rohith), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్(Manchu Manoj)..లతో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) (Sai Dharam Tej) సరదాగా ఇంటరాక్ట్ అయ్యి తన వంతు ప్రమోషన్ చేశాడు. ఇందులో భాగంగా.. ఎంట్రీ ఇవ్వడమే నారా రోహిత్ వద్దకి వచ్చి ‘ ‘ఓజి’ అప్డేట్ కోసం తెలుసుకుందామని వచ్చాను’ అంటూ అన్నాడు సాయి ధరమ్ తేజ్. దీంతో పక్కనే ఉన్న మనోజ్ షాక్ అయ్యాడు.

‘నువ్వు కదా మాకు ఓజి అప్డేట్ ఇవ్వాల్సింది’ అంటూ తేజుని అడిగాడు మనోజ్. కాదు ‘మనోడిని అడగండి’ అంటూ తేజు అతనికి బదులిచ్చాడు. ఈ క్రమంలో ‘నువ్వు ‘ఓజి’ లో నటించావా?’ అంటూ నారా రోహిత్ ను అడిగాడు మనోజ్. అందుకు రోహిత్ ‘నేను కాదు నా ఫియాన్సీ(సిరి లెల్ల) చిన్న రోల్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) లో హీరోయిన్ గా నటించిన సిరి లెల్లని నారా రోహిత్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.














