Sai Dharam Tej: సాయి తేజ్ సూపర్ బైక్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

వినాయక చవితి రోజునాడు(నిన్న) రాత్రి ఎవ్వరూ ఊహించని విధంగా మెగా మేనల్లుడు సాయి తేజ్‌ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. బైక్‌ పై ప్రయాణం చేస్తున్న అతను… అది స్కిడ్ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది. అతను కోలుకోవాలని నటీనటులు తమ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. సాయి తేజ్‌ కు జరిగిన యాక్సిడెంట్ పట్ల ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అతని పై ర్యాష్ డ్రైవింగ్ అంటూ కేసు కూడా ఫైల్ అవ్వడంతో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.

అయితే పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి సాయి తేజ్ ప్రయాణిస్తున్న బైక్ ఇసుక ఎక్కువగా ఉన్న ప్లేస్ లో స్కిడ్ అయ్యిందని.. దాంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కూడా వారు తెలిపారు. ఇదిలా ఉండగా.. అంత ప్రమాదం జరిగినా సాయి తేజ్ బైక్ కు దెబ్బతినలేదు. దాంతో ఆ బైకు వివరాలు తెలుసుకోవాలని చాల మంది గూగుల్ లో సెర్చ్ లు చేయడం మొదలుపెట్టారు. ఆ బైకు పేరు ‘ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌.ఎస్‌’ అని తెలుస్తుంది.

765 సి.సి కెపాసిటీ కలిగిన బైక్‌ ఇది. దీని బరువు 166 కేజీలు అని తెలుస్తుంది.ఈ బైక్ నడిపేప్పుడు 6 గేర్లు వేయాల్సి ఉంది. గంటకు 220 కిలీమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకెళ్లగలదు.దీని ధర రూ.12 లక్షల 78 వేలని తెలుస్తుంది. 2020 చివర్లో సాయి తేజ్ ఈ బైక్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బైక్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus