సాయి ధరమ్ తేజ్ ఫైనలైజ్ చేసిన స్క్రిప్ట్..!

‘సుప్రీమ్’ చిత్రంతో ఇటీవలే మరో విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తిక్క’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సాయి గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఈ చిత్ర కథాంశంలోని రెండవ అర్థ భాగం సాయికి నచ్చక పోవడంతో సాయి ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని వార్తలు విన రాగా.. ఈ చిత్రం ఆగిపోలేదని గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం.. సాయి సూచన మేరకు స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేశారని.. దాంతో త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్బి‌ వి‌ఎస్ రవి దర్శకత్వంలోనూ నటించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus