సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విరూపాక్ష అంటే శివుడి మూడో కన్ను అని అర్థం. రూపం లేని చోట ఏదో ఉందని సాగే ప్రయాణమే విరూపాక్ష సినిమా అంటూ ఈయన చెప్పుకొచ్చారు.ఒక గ్రామానికి చేతబడి చేయగా అసలు ఎందుకు చేశారని కనుక్కొని ప్రయాణమే ఈ విరూపాక్ష సినిమా అని తెలిపారు.
నేను నిజ జీవితంలో ఇలాంటి చేతబడులను నమ్మను కేవలం ఆంజనేయ స్వామిని మాత్రమే నమ్ముకుంటాను ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటారని నమ్మకం తనకు ఉందని తెలిపారు.ఇక ఈ సినిమాకు ముందు తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అసలు నేను యాక్టింగ్ చేస్తానా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉండేదని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం తర్వాత అసలు తనకు మాటలు కూడా రాలేదని ఈయన తెలిపారు.
ఇలా 36 సంవత్సరాల వయసులో తన తల్లి తనకు (Sai Dharam Tej) తిరిగి మాటలు నేర్పించిందని, అమ్మ తనలో ఎంతో ధైర్యాన్ని నింపిందని ఈ సందర్భంగా తన తల్లి గురించి సాయిధరమ్ తేజ్ తెలిపారు. అందుకే అమ్మ తర్వాతే మనకు ఎవరైనా అంటూ ఈయన తెలియచేశారు. ఇక ఈ సినిమా వర్క్ షాప్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని అయితే నేను చేయలేని పరిస్థితులలో ఉన్న నిర్మాతలు అడ్జస్ట్ అవుతూ తనకు ఎంతో సపోర్ట్ గా నిలబడ్డారని తెలిపారు.
ఇక డైరెక్టర్ కార్తీక్ కథ చెబుతున్నప్పుడు చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యానని తెలియజేశారు. ఇకపోతే చాలామంది ఈ సినిమా కాంతార సినిమాకు పోలికలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సినిమాకు కాంతార సినిమాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది.. సాయి తేజ్ కష్టానికి సరైన ఫలితం ఇవ్వబోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!