మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే ఈయనకు కాస్త సమయం దొరకడంతో పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కడప అమీన్ దర్గాను సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈయన మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.తాను పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు ఇలా ప్రమాదం నుంచి బయటపడటంతో ఇది నాకు పునర్జన్మ అని భావిస్తాను ఇలా నాకు పునర్జన్మ ఇచ్చిన ఆ భగవంతుడిని స్మరిస్తూ అన్ని ఆలయాలు తిరుగుతున్నానని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ..మామయ్య తో సినిమాలో నటించే అవకాశం రావడం ఒక అందమైన అనుభూతి అలాగే అదృష్టంగా కూడా భావిస్తానని తెలిపారు. మామయ్య అంటే నాకు ప్రాణం ఆయన కోసం ఏదైనా చేస్తాను అని ఈయన తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాయి ధరంతేజ్ వస్తారా అనే ప్రశ్న ఎదురయింది.
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సమాధానం చెబుతూ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.చాలామంది నన్ను జనసేన పార్టీలోకి రావచ్చు కదా అంటూ ప్రశ్నించారు అయితే మావయ్య చెబితే నేను కాదు అనను కాకపోతే నాకు సినిమా ఉంటే ఇష్టం కనుక మామయ్య కూడా సినిమా రంగంలోనే కొనసాగమని చెప్పారు. అందుకే తాను సినిమాలలోనే కొనసాగుతానని రాజకీయాలపై ఆసక్తి ఉంటే తప్పకుండా రమ్మని మామయ్య చెప్పారు. కానీ నాకు సినిమాలంటేనే ఇష్టం అంటూ ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.