మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వచ్చిన లేటెస్ట్ చిత్రం విరూపాక్ష. మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇదే జోరు మీద సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా రీలీజ్ సాయిధరమ్ తేజ్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా కొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది.
ఈ నేపథ్యంలోనే సాయిథరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనను సాధరంగా ఆహ్వానించిన ఆలయ అధికారులు, దర్శనం చేయించారు శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చాడు. దీంతో సాయిధరమ్ తేజ్ ను హారతివ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నలు సంధిస్తున్నారు భక్తులు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ.. ఆలయ అదికారులు, సాయిధరమ్ తేజ్ మీద భక్తులు ఫైర్ అవుతున్నారు. అయితే, అర్చకులు లేకపోవడంతోనే సాయిధరమ్ తేజ్ అలా చేశాడని.. నిబంధనలు ఉల్లంఘించడానికి కాదని ఆయన అభిమానులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భక్తుల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.