Sai Dharam Tej: ‘పాపా’ సినిమా సాయితేజ్‌ చేసుంటే.. కెరీర్‌ ఇంకా కష్టాల్లోనేగా!

కొన్ని సినిమాల టీజర్లు బాగుంటాయి, ట్రైలర్‌ బాగుంటుంది, పాటలు బాగుంటాయి.. కానీ ఫైనల్‌గా సినిమా చూస్తే బాగోదు, అబ్బే అనిపిస్తోంది. అలాంటి సినిమాల్లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఒకటి. నాగశౌర్య, మాళవికా నాయర్‌ జోడీగా నటించిన ఈ సినిమాను అవసరాల శ్రీనివాస్‌ తెరకెక్కించారు. అందులో నాగశౌర్య పేరు బదులు సాయిధరమ్‌ తేజ్‌ ఉండాల్సింది తెలుసు. అవును మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే ఈ సినిమా కథను సాయితేజ్‌కు తొలుత అవసరాల శ్రీనివాస్‌ చెప్పారట.

చాలా రోజుల క్రితం సాయితేజ్‌ – అవసరాల శ్రీనివాస్‌ కాంబో గురించి చర్చ వచ్చింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలో ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్‌ నుండి సాయితేజ్‌ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. అలా సినిమా మొదలవ్వకుండానే సాయితేజ్‌ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు నాగశౌర్య చేసింది ఆ ప్రాజెక్టే అని టాక్‌. అలా సాయితేజ్‌ వదులుకున్న కథను నాగశౌర్య చేశారు అని చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా టాపిక్‌ చాలా టిపికల్. ఈ సినిమాలో కథ కన్నా కథనం కీలకం. ఇలాంటి కథను ఒప్పుకోవడం రిస్కే. సినిమాలో హీరోయిన్ ఏ ఏజ్‌లో అయినా ఒకేలా కనిపిస్తుంది. కానీ హీరో అలా కాదు. హీరో వేరు వేరు గెటప్స్‌లో వయసు మారుతూ కనిపిస్తాడు. దీని కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. గెడ్డం పెంచుతూ, తగ్గిస్తూ కాలం ఎంతో కష్టపడి సినిమా చేశాడు. అయితే సినిమాకు సరైన స్పందన రాలేదు అని చెప్పొచ్చు.

నాగశౌర్య ఈ సినిమా ఒప్పుకోవడానికి గతంలో అవసరాల శ్రీనివాస్‌కి ఆయనకు మధ్య ఉన్న పరిచయం, స్నేహం కావొచ్చు. అయితే ఇలాంటి వాటిని వదిలి కథల విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడే ఇలాంటి ఫలితాల నుండి దూరంగా ఉండగలం అని అంటుంటారు. సాయితేజ్‌ మిస్‌ అయ్యాడు ఇంచుమించుగా ఇలాంటి ఆలోచన చేసే అని చెప్పొచ్చు. మరి నాగశౌర్య ఎప్పుడు ఇలా నో చెబుతాడో.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus