వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా… థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటిటి సంస్థలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వాటికి సబ్ స్క్రైబర్స్ కూడా 3 రెట్లు పెరిగారు. దాంతో ఇప్పుడు చిన్న సినిమాలు.. అలాగే విడుదలకు నోచుకోకుండా మూలాన పడిపోయిన సినిమాలను ఓటిటిలో విడుదల చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఓ పెద్ద సినిమాను విడుదల చేస్తే.. మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుందని ఓటిటి నిర్వాహకులు తెగ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
‘వి’ ‘ఉప్పెన’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలను ఓటిటిలో విడుదల చెయ్యమని ఆ సినిమాల నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ వారు ముందడుగు వేయలేకపోతున్నారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ లిస్ట్ లో సాయి తేజ్ సినిమా కూడా చేరినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘సినిమాని ఓటీటీ లో విడుదల చెయ్యమని నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రసాద్ నిర్మించాడు.
తమన్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాలతో సాయి తేజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తే ప్లస్ అవుతుంది అని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు భావిస్తున్నాయని తెలుస్తుంది.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?