‘సరిలేరు’ నిర్మాతలతో మెగా మేనల్లుడు సినిమా?

అరడజను ప్లాప్ ల తర్వాత గత ఏడాది ‘చిత్రలహరి’ తో హిట్ అందుకున్న సాయి తేజ్ … తర్వాత ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం థీమ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుబ్బు అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టబోతున్నాడని సమాచారం.

వివరాల్లోకి వెళితే… ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర తన ‘ఏకె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్’ పై సాయి తేజ్ తో ఓ పీరియాడిక్ డ్రామా ను నిర్మించబోతున్నాడట. ఈ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నాడట. సాయి తేజ్ ఈ టైంలో రిస్క్ చేస్తున్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఎక్కువ బడ్జెట్ పెడతాడు కాని .. సక్సెస్ లు మాత్రం అందుకునేది తక్కువే. ఈ మధ్య కాలంలో ఒక్క ‘సరిలేరు’ తప్ప ఈయనకి మరో హిట్ లేదు. అది కూడా దిల్ రాజు, మహేష్, అనిల్ రావిపూడి ఎకౌంటు లోకి కొట్టుకుపోయింది. అందుకే బహుసా వారు ఇలా కామెంట్స్ చేస్తున్నారేమో.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus