Sai Dharam Tej: డాక్టర్ల ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతున్న సాయి తేజ్..!

మెగా మేనల్లుడు సాయి తేజ్‌.. ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు.కేబుల్ బ్రిడ్జి పై సాయి తేజ్ బైక్ స్కిడ్ అవ్వడంతో అతను కంట్రోల్ చేయలేక క్రింద పడిపోయాడు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ నిన్నటి నుండీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఈ యాక్సిడెంట్ లో సాయి తేజ్ కు చిన్న చిన్న గాయాలే అయ్యాయి…అతనికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటూ మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.

కానీ అతను స్పృహకోల్పోయాడు.దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.అంతర్గతంగా ఎటువంటి గాయాలు కాలేదు అని వారు ధృవీకరించారు.హెల్మెట్ పెట్టుకుని అతను డ్రైవింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం నుండీ అతను తప్పించుకున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. అపోలో ఆసుపత్రిలో నిన్న రాత్రంతా ముగ్గురు వైద్యుల సమక్షంలో సాయి తేజ్ ను అబ్జర్వేషన్లో పెట్టారు. నిన్నటి నుండీ అతను స్పృహలోకి వస్తున్నాడు మళ్ళీ స్పృహ కోల్పోతున్నాడు అని వైద్యులు చెబుతున్నారు.

అయితే గత 2,3 గంటల నుండీ అతను డాక్టర్లకు రెస్పాండ్ అవుతున్నట్టు సమాచారం. చేతులు కదుపమని.. అటు ఇటు చూడమని వారు చెబుతుండగా అతను.. వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు. అమ్మా.. అమ్మా.. అంటూ అతను కలవరిస్తున్న విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మీరు కూడా చూడండి :

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus