‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి తేజ్.. వరుసగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ వంటి హిట్లు అందుకుని… అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు. మధ్యలో ‘రేయ్’ చిత్రం కూడా వచ్చింది. నిజానికి తేజు కి అదే మొదటి చిత్రం.. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ గా రిలీజ్ అయ్యింది. అయితే అటు తర్వాత… ఇతనికి ఉన్న మొహమాటం వల్ల సినిమాలు చేస్తాను అని చిన్న నిర్మాతలకు మాట ఇచ్చేసాడని…
దాంతో ప్లాప్ డైరెక్టర్ లతో సినిమాలు చెయ్యడం వల్ల డిజాస్టర్ లు పడటం తో ఇతని కెరీర్ చాలా వరకూ దెబ్బతింది. మార్కెట్ కూడా పడిపోయింది. అలాంటి టైములో ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాలతో హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇతని కెరీర్ లో ఓ స్యాడ్ పార్ట్ కూడా ఉందని తెలిపి షాక్ ఇచ్చాడు. ‘నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
మాకు ఏ లోటు లేకుండా అమ్మే పెంచి పెద్ద చేసింది. నేను, తమ్ముడు పెళ్ళిళ్ళు చేసుకుంటే.. అమ్మ ఒక్కత్తే అయిపోకూడదు అని భావించి 2011 లో రెండో పెళ్ళి చేసాం. ఆయన ఓ కంటి డాక్టర్. చాలా మంచి వారు. ఇక మా నాన్న గారు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు.. కాబట్టి ఎక్కువగా ఆయన దగ్గర నా కెరీర్ గురించి మాట్లాడను. ఇప్పుడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంటున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.