Satya Teaser: సైనికుల భార్యల త్యాగాల ఆధారంగా సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిలిం.. టీజర్ ఇదిగో..!

ఈ ఏడాది ‘విరూపాక్ష’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఆ సినిమా ప్రమోషన్లలో అతను నెక్స్ట్ ఓ షార్ట్ ఫిలిం చేస్తున్నట్లు తెలియజేశాడు. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ కృష్ణ ఈ షార్ట్ ఫిలింకి దర్శకుడు.

20 నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిలిం ఇదని తెలుస్తుంది. (Satya) ‘సత్య’ అనే టైటిల్ తో రానుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌, కలర్స్ స్వాతి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ షార్ట్ ఫిలింకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ని వదిలారు. ‘సోల్ ఆఫ్ స‌త్య’ అనే పేరుతో ఈ గ్లింప్స్‌ ఉంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి చేసుకోవ‌టం.. వారి మధ్య అన్యోన్యతని 29 సెకన్లలో చూపించారు.

ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ సైనికుడి పాత్ర పోషిస్తున్నాడు. ఓ సైనికుడు భార్య దేశం కోసం చేసే త్యాగాల‌ను ఇందులో చూపించబోతున్నారు. ‘బలగం’ నిర్మాతలు అయిన హ‌ర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి.. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఈ షార్ట్ ఫిలింని నిర్మించారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్.. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus