Sai Dharam Tej: ఆరు నెలలు ఇండస్ట్రీకి దూరం కాబోతున్న సాయి ధరమ్ తేజ్… ఎందుకంటే?

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సుప్రీం హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు సాయిధరమ్ తేజ్. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. ఈ సినిమా తర్వాత తాను ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలిపారు. అయితే తన స్నేహితులతో కలిసి నటించిన షార్ట్ ఫిలిం మాత్రం ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు.

ఆరు నెలలపాటు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నానని అందుకే ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఈ విధంగా ఈ హీరో ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… రోడ్డు ప్రమాదం తర్వాత ఈయనకు అవసరమైనటువంటి సర్జరీలన్నీ చేశారు.

అయితే ఈయన మరొక సర్జరీ కూడా చేయించుకోవాల్సి ఉందట అందుకోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆ సర్జరీ చేయించుకొని పూర్తిగా కోరుకున్న తరువాత తాను తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నానని అప్పటివరకు తాను బ్రేక్ తీసుకుంటున్నానని సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus