సాయి ధరమ్ తేజ్ లిస్ట్ లో మరో సినిమా!

మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న తరువాత వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నెలలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి చేసి దర్శకుడు దేవా కట్టా రూపొందిస్తోన్న సినిమా కోసం పని చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జీ టీవీ సినిమా హక్కులను కొనేసి.. ప్రొడక్షన్ కి కావాల్సిన ఫండ్స్ ని అందిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ మెగాహీరో ఇప్పుడు మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పీరియాడిక్ సినిమాలు బాగా ఎక్కువయ్యాయి. ‘రంగస్థలం’ సినిమా తరువాత ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోంది. సుకుమార్ శిష్యుల్లో ఒకరు దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయనున్నారు.

1970ల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. 1970 బ్యాక్ డ్రాప్, అప్పటి కాలమాన పరిస్థితులను సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో ఓ హారర్ సినిమా చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. నిజానికి ఈ మెగాహీరోకి హారర్ సినిమాలంటే చాలా భయం. కానీ ఇప్పుడు అదే జోనర్ లో సినిమా చేయబోతుండడం విశేషం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus