సినిమాలో నేను డైలాగ్‌లకు థియేటర్‌లో చప్పట్ల మోత మోగాలని, విజిల్స్ పడలాని కోరుకోని రచయిత ఉండరు. అలాంటి సినిమా పడితే ఆనందించని వ్యక్తి కూడా ఉండరు. అలాంటి అప్రిసియేషన్ ఇచ్చిన ఓ సినమాకు తనకు అస్సలు నచ్చదు అని అంటున్నారు ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకు నచ్చని సినిమా, కారణం కూడా చెప్పారాయన.
టాలీవుడ్‌లో ప్రజెంట్ పవర్‌ఫుల్ డైలాగ్‌లు రాయాలన్నా, గుండెలు పిండేసే మాటలు రాయాలన్నా, రోమాలు నిక్కబొడుకునే సంభాషణలు రాయాలన్నా… వినిపించే రచయితల పేర్లలో బుర్రా సాయిమాధవ్ పేరు తొలి వరుసలో ఉంటుంది. కావాలంటే ఆయన సినిమాల లైనప్ చూస్తే మీకే తెలుస్తుంది. ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలకు మాటలు రాశారు. ఇటీవల విడుదలైన సంచనాలు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కి కూడా ఆయనే మాటలు అందించారు.
ఇన్నేసి బంపర్ హిట్లకు మాటలు అందించారు కదా మరి మీరు వర్క్ చేసిన సినిమాల్లో మీకు నచ్చని సినిమా ఏంటి అని ఆయన్ను అడిగితే… ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అని చెప్పారు. అదేంటి ఆ సినిమాలో ఆయన మాటలు సూపర్ కదా అంటారా? అసలు ఆయనకు నచ్చకపోవడానికి కూడా అవే కారణమట. సినిమాలో హీరో, హీరోయిన్ ఎదురుపడినప్పుడల్లా మాటలే ఉంటాయని, అలా ఎదురెదురుగా నిల్చుని పేజీల పేజీల డైలాగ్‌లు మాట్లాడటం తనకు నచ్చలేదని చెప్పారు బుర్రా సాయిమాధవ్.
సినిమా నిండా ఇలా డైలాగులు మాత్రమే ఉంటే ఎలా.. అంటూ సాయిమాధవ్ ప్రశ్నించారు. ఆ సినిమాకు ఎంతో ఇష్టపడి, మంచి డైలాగులే రాశానని చెప్పారాయన. అయితే తన మాటలు తనకు నచ్చినా సినిమా మాత్రం నచ్చలేదని చెప్పారాయన. ఇక ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ప్రతి సన్నివేశంలోనూ కథను, పాత్రల వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు. హీరోలు కలిసే సన్నివేశంలో నీరు, నిప్పును కలిపి చూపించిన విధానం తనకు బాగా నచ్చిందని చెప్పార బుర్రా సాయిమాధవ్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!