కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శంకర్. ‘జెంటిల్మెన్’ ‘జీన్స్’ ‘బాయ్స్’ ‘అపరిచితుడు’ ‘శివాజీ’ ‘రోబో’ వంటి చిత్రాలతో ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్లు కొట్టి.. ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇతను సినిమాలు ఎ సెంటర్.. బి సెంటర్ ఆడియెన్స్.. సి సెంటర్ ఆడియెన్స్ అనే లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అయితే గత కొంత కాలంగా ఇతను సరైన హిట్టు కొట్టలేకపోతున్నాడు.
‘రోబో’ తర్వాత చూసుకుంటే ‘3 ఇడియట్స్’ రీమేక్ అయిన ‘స్నేహితుడు’, ‘ఐ’, ‘2.0’ వంటి సినిమాలు సొ సొ అన్నట్టే ఆడాయి. శంకర్ సరైన విజయం అందుకోకపోవడానికి ముఖ్య కారణం సరైన రైటర్ అతని వద్ద లేకపోవడమే అనే టాక్ వినిపిస్తుంది. ‘రోబో'(ఎందిరన్) మూవీ వరకు ఇతని వద్ద సుజాత రంగరాజన్ అనే రైటర్ పనిచేసేవారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లిన టైంలో అతను మరణించారు. అటు తర్వాత శంకర్ కు సరైన రైటర్ దొరకలేదు. పైగా భారీ బడ్జెట్ పెట్టిస్తాడు అనే విమర్శ కూడా ఉంది.
అయితే అతను రాంచరణ్ తో చేయబోయే మూవీకి టాలీవుడ్ స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఎంపికయ్యాడు. ఇది ఓ రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సాయి మాధవ్ మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. అతని సంభాషణలు కూడా అద్భుతంగా ఉంటాయి. ‘మహానటి’ ‘సైరా’ వంటి చిత్రాలు అంత బాగా వచ్చాయి అంటే ఈయన కృషి కూడా ఉంది. అలాంటి రైటర్ శంకర్- చరణ్ ల మూవీకి ఎంపికచేసుకోవడం నిర్మాత దిల్ రాజు గారి తెలివైన నిర్ణయమనే చెప్పాలి.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్