టాలీవుడ్లో తిప్పి కొడితే 25 సినిమాలు కూడా చేయకుండానే గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు బుర్రా సాయి మాధవ్. ఈ విధంగా ఆయన ఏ రచయితకి సాధ్యం కాని రికార్డ్ ను సృష్టించాడు. ఈయన సినీ ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాలోని న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ వారు బుర్రా సాయి మాధవ్ కు గౌరవ డాక్టరేట్ ను అందించి సత్కరించారు. హైదరాబాద్, రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సాయి మాధవ్ ఈ విషయమై సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పురస్కారాన్ని ఆయన తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించి ప్రశంసలు అందుకున్నారు.
కొందరు రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కెరీర్ ప్రారంభంలో పలు నాటకాలకి రచయితగా పనిచేసిన బుర్రా సాయి మాధవ్ ట్యాలెంట్ ను గుర్తించి.. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాకి అవకాశం ఇచ్చాడు.ఆ సినిమాకి సాయి మాధవ్ సమకూర్చిన సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అటు తర్వాత ‘కంచె’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘సైరా నరసింహారెడ్డి’
వంటి చిత్రాలు సాయి మాధవ్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. పాన్ వరల్డ్ చిత్రమైన ‘ఆర్.ఆర్.ఆర్’ కు అలాగే చరణ్- శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రానికి కూడా రైటర్ గా పనిచేస్తూ బిజీగా గడుపుతున్నారు సాయి మాధవ్.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!