Sai Madhav Burra: ఎన్టీఆర్ బయోపిక్ పై సాయిమాధవ్ కామెంట్స్ వైరల్!

ప్రతి డైరెక్టర్, హీరో తమ సినిమాలు సక్సెస్ సాధించాలనే ఆలోచనతోనే సినిమాలను మొదలుపెడతారు. అయితే వేర్వేరు కారణాల వల్ల కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంటాయి. ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కి కొన్ని రోజుల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడంతో పాటు భారీ నష్టాలను మిగిల్చాయి.

ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటల రచయితగా పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిమాధవ్ బుర్రా ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయిందనే బాధ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. స్కూల్ లో చదువుకునే సమయంలోనే తాను నాటకాలు వేశానని తన తల్లిదండ్రులు స్టేజ్ ఆర్టిస్టులు అని తెనాలిలో తాను పుట్టి పెరిగానని చెప్పుకొచ్చారు. సినిమాలకు రచయితగా పని చేయాలనే ఆలోచనతో వచ్చిన తాను కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నారు.

ఆకలితో అలమటించిన రోజులు సైతం తన లైఫ్ లో ఉన్నాయని సాయిమాధవ్ బుర్రా కామెంట్లు చేశారు. కొన్ని సీరియళ్లకు తాను పని చేశానని సీరియళ్ల వల్లే తనకు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాకు పని చేసే అవకాశం దక్కిందని సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు పని చేసే ఛాన్స్ రావడంతో ఆ ఛాన్స్ రావడం లక్ అని ఫీలయ్యానని ఆయన తెలిపారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని బాధ ఉందని సాయిమాధవ్ అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని ఖైదీ నంబర్ 150 మూవీకి పని చేసే ఛాన్స్ దక్కడంతో తాను సంతోషంగా ఫీలవుతున్నానని సాయిమాధవ్ బుర్రా వెల్లడించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని సాయిమాధవ్ బుర్రా చెప్పుకొచ్చారు. కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని భావిస్తే ఆ డైలాగ్స్ ఆకట్టుకోని సందర్భాలు సైతం ఉన్నాయని సాయిమాధవ్ బుర్రా అన్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus