Sai Pallavi: కంగారుపడిపోయి వచ్చేయమంటారు: సాయిపల్లవి

ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం అందరూ పండగను జరుపుకునే ఉంటారు. తమ జీవితంలో తండ్రి స్థానం గురించి గొప్పగా చెప్పుకుని ఉంటారు. మన సైట్‌లో అలా హీరోయిన్లు తమ తండ్రి గురించి చెప్పిన ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. వాటికితోడు సాయిపల్లవి ముచ్చట్లు కూడా చదివేయండి. తన ఫాదర్‌ గురించి గతంలో సాయిపల్లవి చెప్పిన కొన్ని అసక్తికర అంశాలను ఈ సందర్భంగా గుదిగుచ్చి ఇక్కడ అందిస్తున్నాం. సాయిపల్లవి ఎప్పడూన వ్వుతూ, సరదాగా, ఉత్సాహంగా ఉంటుంది.

సినిమా సెట్‌లో అయినా, ప్రచారంలో అయినా, టీవీషోల్లో అయినా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె యాక్టివ్‌నెస్‌కి వాళ్ల నాన్నే కారణమట. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సాయిపల్లవి సినిమాల్లో రాణిస్తోందట. సెంతామరై కన్నన్‌ పోలీసు విభాగంలో పని చేస్తున్నారట. ఆయన యూనిఫాం వేసుకున్నప్పుడు ఎంత కఠినంగా కఠినంగా ఉన్నా… ఇంట్లో మాత్రం కూల్‌గానే ఉంటారట. సాయిపల్లవి సినిమాలో ఏడ్చినా సరే ఆయన తట్టుకోలేరట. కూతురిని సెంతామరై ఎంతగా కనిపెట్టుకుని ఉంటారటే… షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి వేరే చోట ఉన్నప్పుడు నాన్న నుండి ఫోన్‌ వస్తే నేను కాస్త జాగ్రత్తగా మాట్లాడుతుందట.

ఆమె ఏ మాత్రం డల్‌గా మాట్లాడినా కంగారుపడిపోయి వెంటనే ఇంటికొచ్చేయమంటారట సాయిపల్లవి తండ్రి. అలాగే సినిమా షూటింగ్‌ తర్వాత సాయిపల్లవి ఇంటికివెళ్తే… ఆమెతో కబుర్లు చెబుతారట. షూట్‌లో బాగా అలసిపోయిందని కాళ్లు పట్టడం, తల మర్దన చేయడం లాంటివి చేస్తుంటారట. ఒక్కోసారి ఆయన ప్రేమ చూస్తే వింతగా అనిపిస్తుంది అని చెప్పింది సాయిపల్లవి. సాయిపల్లవి సినిమాల సంగతి చూస్తే.. రానాతో కలసి నటించిన ‘విరాటపర్వం’ ఇటీవల విడుదలైంది.

సినిమా ఫలితం సంగతి పక్కనపెడితే ఆమె పాత్ర కోసం పడ్డ కష్టానికి మంచి పేరే వచ్చింది. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి కాస్త గ్యాప్‌ తీసుకుంటుంది అని చెబుతున్నారు. ఇప్పటికే షూట్‌ పూర్తి చేసిన ‘గార్గి’ అనే సినిమాను త్వరలో విడుదల చేస్తారట. అయితే ఆమె రెస్ట్‌ గురించి ఎక్కడా అధికారిక సమాచారం అయితే లేదు. కొత్త సినిమాలేవీ ఆమె ఒప్పుకోకపోవడంతోనే ఇలా చెబుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus