Sai Pallavi: ప్రతి ఒక్కరి హార్ట్ ని టచ్ చేసే లవ్ స్టొరీ: సాయి పల్లవి

ఫిదా సినిమా తర్వాత సాయిపల్లవి బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఆమె లవ్ స్టోరీ సినిమాపై మాత్రం చాలా నమ్మకంతో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నాగ చైతన్య తెలంగాణ అబ్బాయిగా నటించాడు. సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు కూడా విలేజ్ నుంచి హైదరబాద్ కు వచ్చిన లవ్ బర్డ్స్ లా కనిపించబోతున్నారు. వారి కలలు నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అనుకోకుండా ఏర్పడినా ఒక సంఘటన వారి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది అనేది ఈ కథలోని అసలు పాయింట్.

శేఖర్ కమ్ముల ఇప్పటివరకు చూపించని ఒక అంశాన్ని ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నాడట. ముఖ్యంగా కుల వ్యవస్థ పై ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవుతుందని వివరణ ఇచ్చారు. ఇక లవ్ స్టోరీ సినిమా ఒక బలమైన సందేశంతో పాటు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, ప్రతి ఒక్కరి గుండెలను కూడా టచ్ చేస్తుందని సాయిపల్లవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు కలిసి చేస్తున్న ప్రమోషన్ ఇంటర్వ్యూలకు కూడా భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇక కరోనా సెకండ్ వేవ్ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా లవ్ స్టోరీ నిలుస్తుందని అంటున్నారు. యూఎస్ లో సినిమా ఫుల్ స్పీడ్ తో అడ్వాన్స్ బుకింగ్ అందుకుంటున్నట్లు సమాచారం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus