Sai Pallavi: ఇదే ఆలోచన అందరి హీరోయిన్లకు ఉంటే సూపర్‌ కదా!

సినిమాలో నటిస్తాం.. కానీ సినిమా ప్రచారానికి రాం! ఈ మాట కొత్తది కాదు.. చాలా పాతదే అనుకోండి. పక్క రాష్ట్రాల నుండి టాలీవుడ్‌కి వచ్చి పై మాట చెప్పి ప్రచారంలో పాల్గొనని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. నటించడం వరకే నా పని, మిగిలింది మీరు చూసుకోండి అని చెప్పకనే చెప్పినట్లు. ఇంకొంతమంది అయితే సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన విషయాలు మనసులో పెట్టుకుని రావడం లేదు. కానీ సినిమా ప్రచారం నా బాధ్యత అంటోంది సాయిపల్లవి. అందుకే ఈ చర్చ మరోసారి వచ్చింది.

సినిమాలో నటించేస్తా చాలు అని టాలీవుడ్‌ హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారు అనేది మనం పేరు పెట్టి చెప్పడం బాగోదు, అలాగే ఒకటి రెండు రోజుల్లో ప్రచారంలో పాల్గొని మళ్లీ ముఖం చూపించని వాళ్లున్నారు. తొలి రకం నాయికల్లో ఒకరికి ఇటీవల వివాహమైంది. మరో రకం నాయిక అయితే మొన్నీమధ్యే కాన్స్‌ ఫిలింఫెస్టివల్‌లో ‘పాల’ రాతి బొమ్మలా మెరిసిపోయింది. ఈ సమయంలో ‘ఇది నా బాధ్యత’ అని చెప్పింది సాయిపల్లవి. అంతేకాదు తొలి సినిమా ‘ప్రేమమ్’ నుండి ప్రచారం అనేది నాకు అలవాటైంది అని చెప్పింది సాయిపల్లవి.

‘‘సినిమాని ఏ నమ్మకంతో చేశామో.. ప్రేక్షకులకు చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి కూడా చెప్పాల్సి ఉంటుంది’’ అని ఫుల్‌ క్లారిటీతో చెప్పేసింది సాయిపల్లవి. అంతేకాదు ‘మన సినిమాని మనం ప్రమోట్ చేయకపోతే ఎవరు చేస్తారు’ అని ప్రశ్నిస్తోంది కూడా. ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తోంది ‘విరాటపర్వం’ కోసమే అని మీకు తెలిసే ఉంటుంది.

‘‘ఆర్టిస్ట్‌ కొత్తదనం ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. ఒకే క్వశ్చన్‌ పేపర్‌కు అవే ఆన్సర్లు రాస్తూ ఉంటే కిక్‌ రాదు. ఏదైనా కొత్తగా చేశాం, కొత్త విషయం నేర్చుకున్నామనే తృప్తి కచ్చితంగా ఉండాలి. ప్రతి పాత్ర చేసేటప్పుడు బాధ, ఒత్తిడి ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంటుంది. లేదంటే వర్క్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ కూడా బోర్ కొట్టేస్తాయి’’ అంటూ తన కెరీర్‌ రహస్యం చెప్పింది సాయి పల్లవి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus