Sai Pallavi, Yash: రాఖీ బాయ్ సినిమాలో లేడీ పవర్ స్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి గత కొద్ది రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇప్పుడు మాత్రం వరుస భాషా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈమె (Sai Pallavi) తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి తండెల్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె కన్నడ సినీ నటుడు కే జి ఎఫ్ స్టార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

కే జి ఎఫ్ సినిమా ద్వారా రాఖీ భాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యశ్ తన 19 వ సినిమా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి అవకాశమందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు అయితే డిసెంబర్ 8వ తేదీ ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నారు

ఆ సమయంలోనే హీరోయిన్ దర్శకులు ఎవరు అనే విషయాలను కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా రాఖీ బాయ్ లేడీపవర్ స్టార్ కాంబినేషన్లో సినిమా అంటే సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరుగుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus