Sai Pallavi: ‘సెట్స్ లో అమ్మాయిలతో కూడా రానా అలానే ఉంటారు’!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. తెలుగులో ఆమె నటించిన ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’, ‘ఎంసిఏ’ ఇలా చాలా సినిమాలు మంచి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఆమెకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. యూత్ లో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలు మరింత పెంచేసింది.

రానా ఈ సినిమాలో హీరోగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సాయిపల్లవి. ఈ సందర్భంగా తన కోస్టార్ రానా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విరాటపర్వం’ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు సాయిపల్లవిని కొందరు ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అయితే రానా ఆమెకి రక్షణగా నిలిచారు. ఆమెకొక బౌన్సర్ లా మారిపోయారు.

ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రానాను తనను అంత జాగ్రత్తగా చూసుకున్నందుకు సాయిపల్లవి ఇంప్రెస్ అయింది. రానా తనతో కాకుండా.. సెట్స్ లో ఉండే అమ్మాయిలతో అలానే ఉంటారని.. చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఈవెంట్స్ కి వెళ్లే సమయంలో ఫ్యాన్స్ దగ్గరకి వచ్చేసేవారని..

అప్పుడు రానా అరిచి వాళ్లను పక్కకు పంపేవారని.. అలా తనకొక బౌన్సర్ లా మారిపోయారని తెలిపింది సాయిపల్లవి. అతడు మంచి కోస్టార్ అని చెప్పింది. ఇక ‘విరాటపర్వం’ సినిమాలో వెన్నెల అనే క్యారెక్టర్ లో కనిపించనుంది సాయిపల్లవి. సినిమా కథ కూడా ఆమె కోణంలో ఉంటుందని సమాచారం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus