గత కొన్న రోజులుగా వార్తల్లో ఉన్న కథానాయిక సాయిపల్లవి. సినిమాలు మానేస్తుంది, మానేస్తుందా అంటూ రెండు రకాల మాటలు ఆమె గురించి వినిపిస్తూ వచ్చాయి. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి ఒక్కసారిగా కామ్ అయిపోవడంతోనే ఈ మాటలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆమె దీనిపై క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటు మరో సర్ప్రైజ్ కూడా ఫ్యాన్స్కి వచ్చింది. అదే ఫ్యామిలీ ఫొటోస్. సాయిపల్లవి ఫ్యామిలీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి, ఆమె సోదరి పూజా కన్నన్, ఇతర కుటుంబ సభ్యులు ఆ ఫొటోల్లో వైట్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వాళ్ల ప్రాంతంలో ఘనంగా జరిగే హెతాయి హబ్బా ఫెస్టివల్లో కుటుంబం పాల్గొంది. అందులో సాయిపల్లవితోపాటు ఆమె కజిన్స్ కూడా పాల్గొన్నారు. ట్రెడిషన్ లుక్లో మెరిసిపోతున్న సాయిపల్లవి, పూజా కన్నన్ను చూసి ఫ్యాన్స్ తెగ లైక్లు, షేర్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి. సినిమాల గురించి సాయిపల్లవి ఏమందంటే..
‘ప్రేమమ్’తో నా ప్రయాణం మొదలైంది. నేను ఎంబీబీఎస్ చదివినా.. నటిని కావాలనుకున్నాను. నా నిర్ణయానికి మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నా పాత్రలు వాళ్లకి ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండాలని భావిస్తాను. మంచి కథలు వస్తే ఏ భాషలో అయినా నటించడానికైనా సిద్ధం అని క్లారిటీ ఇచ్చింది సాయిపల్లవి. గతేడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ సినిమాలలో సాయి పల్లవి నటించింది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ సరసన సాయిపల్లవి నటించనుందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో సాయిపల్లవి సీతగా అలరించనుందని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.