గతేడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సాయిపల్లవి ఈ ఏడాది విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందని సాయిపల్లవి ఫ్యాన్స్ భావిస్తున్నారు. విరాటపర్వం సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోయినా సినిమా రిలీజయ్యాక పరిస్థితి మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయిపల్లవి
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను చాలామంది తెలంగాణ ఆడపడుచు అనుకోవడంపై స్పందిస్తూ ఎక్కువమంది అదే విధంగా అనుకుంటున్నారని డైరెక్టర్ వేణు ఊడుగుల కూడా తనతో ఇదే విషయం చెప్పారని ఆమె కామెంట్లు చేశారు. గత జన్మలో తాను తెలంగాణలో పుట్టి ఉంటానని అందుకే ఈ విధంగా చెబుతున్నారని సాయిపల్లవి తెలిపారు. రానా నుంచి ఏం నేర్చుకున్నారనే ప్రశ్నకు సాయిపల్లవి స్పందిస్తూ అద్భుతమైన స్టోరీలను రానా ఎంపిక చేసుకుంటారని రానా నుంచి స్టోరీ రేంజ్ ను పెంచడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.
గతంలో కథల విషయంలో తనకు ఉన్న అభిప్రాయం రానా వల్ల మారిందని సాయిపల్లవి కామెంట్లు చేశారు. నక్సలిజం గురించి ఒపీనియన్ చెప్పాలని కోరగా సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం దేని గురించి అయినా ఒపీనియన్ ను వ్యక్తపరచాలంటే మనం ఆ కాలానికి చెంది ఉండాలని విరాటపర్వంలో తన పాత్రను తాను చేశానని సినిమా చేసే సమయంలో సమూహం ఉద్యమంలో భాగం కావాలని ఎందుకు అనుకున్నారో తనకు అర్థమైందని ఇది నాకు లెర్నింగ్ ప్రాసెస్ అని ఆమె కామెంట్లు చేశారు.
విరాటపర్వం సినిమాపై తన కామెంట్లతో సాయిపల్లవి అంచనాలను పెంచారు. సాయిపల్లవి సక్సెస్ సెంటిమెంట్ ను ఈ సినిమా కంటిన్యూ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. సాయిపల్లవి కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!