Sai Pallavi: అలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు పెంచారు.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నటన, డాన్సులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా మొదటి సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో సాయి పల్లవికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేకపోయినా ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమెకు ఈ సినిమా మంచి విజయం అందుకొని వరుస అవకాశాలు రావడంతో తన సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా ఇండస్ట్రీ వైపు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ తెలిపారు. ఎప్పుడైతే తనకు అవకాశాలు రాకపోతే చేతిలో ఎలాగో మెడిసిన్ ఉంది వైద్యవృత్తిలో స్థిరపడతాను అంటూ తెలిపారు.ఇక మొదటి నుంచి కూడా తమ తల్లిదండ్రులు డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా పెంచారని సాయి పల్లవి తెలిపారు.

చిన్నప్పటినుంచి ఏ వస్తువు కొనుగోలు చేయాలన్న అది మనకు ఎంతవరకు అవసరమో తెలుసుకొని కొనుగోలు చేస్తానని, ఇప్పటికీ నేను ఏదైనా కొన్నాను అంటే తప్పకుండా ఓటిపి అమ్మకు వెళుతుంది అంటూ సాయి పల్లవి తన తల్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి నేను చేసే ఖర్చు అమ్మ చేతి పై నుంచి జరగడం తనకు అలవాటు అంటూ సాయి పల్లవి తల్లిచాటు బిడ్డ అని చెప్పకనే చెప్పేశారు.

ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే సాయి పల్లవి లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె రానా సరసన విరాట పర్వం సినిమా ద్వారా ఈ నెల 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!


అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus