Sai Pallavi: సీత పాత్రలో సాయిపల్లవి.. కచ్చితంగా మెప్పిస్తుందంటూ?

  • December 8, 2022 / 11:18 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మలయాళ ప్రేమమ్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అద్భుతంగా డ్యాన్స్ చేసే సాయిపల్లవి ఆ రోల్స్ తో ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు స్టార్స్ కు జోడీగా నటించే ఛాన్స్ రాకపోయినా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటివరకు సౌత్ సినిమాలకే పరిమితమైన సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు.. రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో సాయిపల్లవి నటించనున్నారని సమాచారం.

ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ రావణుని పాత్రలో కనిపిస్తారని బోగట్టా. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఊహించని రేంజ్ లో పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. 2023 సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సాయిపల్లవి ఎక్కువ సినిమాలలో నటించకపోవడంతో సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సాయిపల్లవి ఇకపై డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించనున్నారని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సాయిపల్లవికి మూవీ ఆఫర్లు రావడంతో పాటు సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్ లో కూడా సాయిపల్లవి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయిపల్లవికి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus