Sai Pallavi: సినిమా ఫ్లాప్ అవడంతో రెమ్యూనరేషన్ వద్దన్న సాయిపల్లవి.. కానీ?

నటి సాయి పల్లవి ఒకప్పుడు వెండితెరపై సౌందర్య తరహాలో ఈమె కూడా వెండితెరపై ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఎంపిక విషయంలో సాయి పల్లవి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. తనకు సినిమా నచ్చకపోతే స్టార్ సెలబ్రెటీలు అయినా భారీ రెమ్యునరేషన్ అయినా సినిమాకి కమిట్ అవ్వదు. నిర్మొహమాటంగా ఆ సినిమాలో తాను నటించినని తేల్చి చెప్పేస్తుంది. ఇక సినిమా నచ్చితే మాత్రం రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాయిపల్లవి నైజం.

ఇలా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసే సాయిపల్లవి నటించిన సినిమాలన్నీ కూడా దాదాపు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈమె దగ్గుబాటి హీరో రానాతో కలిసి విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేశారు.

తనకు సంబంధించిన అన్ని పనులను తన తల్లి దగ్గ రుండి చూసుకుంటుందని కేవలం కథల ఎంపిక విషయంలో మాత్రం తానే నిర్ణయం తీసుకుంటానని సాయి పల్లవి తెలిపారు. అయితే తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తను చాలా బాధ పడతానని నావల్ల నిర్మాత నష్టపోయారనే బాధ తనని కలిచివేస్తోందని తెలిపారు.ఈ క్రమంలోనే తన కెరియర్ లో శర్వానంద్ తో కలిసి నటించిన పడి పడి లేచే మనసు సినిమా విషయంలో ఇలాగే జరిగిందని తెలిపారు.

Padi Padi Leche Manasu Movie, Hanu Raghavapudi, Sai Pallavi, Sharwanand

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నిర్మాత సుధాకర్ గారు తనకు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయిన తర్వాత సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇవ్వాల్సిన బ్యాలెన్స్ తనకు వద్దని సాయి పల్లవి తల్లి నిర్మాత సుధాకర్ గారికి చెప్పారట. కానీ ఆయన మాత్రం వినిపించుకోకుండా చివరి రూపాయి వరకు తన రెమ్యూనరేషన్ క్లియర్ చేశారని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. ఇకపోతే తాను గ్లామర్ షో చేయకుండా అవకాశాలు వస్తే నటిస్తానని అలాంటి అవకాశాలు రాకపోతే వైద్య వృత్తిలో స్థిరపడతానని సాయిపల్లవి తెలిపారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus