Sai Pallavi: సాయి పల్లవికి ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె తాజాగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.సాయి పల్లవి ఎలాంటి గ్లామరస్ పాత్రలకి చోటు లేకుండా ఎంతో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని అలాంటి సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇకపోతే ఈమె కొత్తగా ఏ విధమైనటువంటి సినిమాలను ప్రకటించకపోవడంతో చాలామంది ఈమె ఇండస్ట్రీకి దూరం అవుతారని తనకెంతో ఇష్టమైన వైద్య వృత్తిలో స్థిరపడ్డారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. అదేవిధంగా మరికొందరైతే తను పెళ్లి చేసుకోబోతోందని పుకార్లు కూడా పుట్టించారు. ఇలా తన గురించి పెళ్లి వార్తలు రావడంతో సాయి పల్లవి స్పందిస్తూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే రానా సరసన నటించిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈమె మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో గార్గి అనే ఈ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే తన అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్నకు ఈమె టకటక తనకిష్టమైన హీరోల లిస్ట్ మొత్తం బయట పెట్టేశారు.

తనకు కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అంటే ఎంతో ఇష్టమని వీరిలో కమల్ హాసన్ అంటే మరీ ఇష్టమని సాయిపల్లవి తెలిపారు. కమల్ హాసన్ అంటే తనకి ఎంతిష్టమంటే ఏకంగా ఆయన నటించిన సినిమా కు సంబంధించిన పోస్టర్స్ కట్ చేసి తన దగ్గర దాచుకున్నానని, ఇప్పటికీ ఆ పోస్టర్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయని సాయి పల్లవి తెలియజేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus