Sai Pallavi, Ram Charan: చరణ్ సాయిపల్లవి కాంబినేషన్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ 2024 సంవత్సరం నుంచి సినిమాలకు సంబంధించి వేగం పెంచనున్నారని సమాచారం అందుతోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో అర్జున్ అంబటి ఫైనల్ అయ్యారని ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుందని భోగట్టా. చరణ్ సాయిపల్లవి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఈ కాంబో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరణ్ సాయిపల్లవి కాంబో మూవీలో డ్యాన్స్ లు కూడా మామూలుగా ఉండవని తెలుస్తోంది. సరికొత్త కథాంశంతో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమాలోని ట్విస్టులు సైతం మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సాయిపల్లవి పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. ఆచార్య ఫ్లాప్ తో చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత చరణ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు రావాల్సి ఉంది. చరణ్ త్రివిక్రమ్ కాంబో, చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో, చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో సినిమాలు రావాలని నెటిజన్లు భావిస్తుండగా ఈ కాంబినేషన్లలో సినిమాలు రావడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లపై దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ సంవత్సరానికి కనీసం ఒక సినిమా రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus