టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. సాయిపల్లవి అభిమానులను ఈ వార్తలు ఎంతగానో టెన్షన్ పెడుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి సాయిపల్లవి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మెడిసిన్ చదివినా యాక్టర్ కావాలని భావించానని ఆమె అన్నారు. తాను సినీ నటి అవుతానని చెప్పిన సమయంలో పేరెంట్స్ నుంచి కూడా ఎలాంటి ఆంక్షలు లేవని సాయిపల్లవి కామెంట్లు చేశారు.
ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా ప్రయాణం మొదలైందని అందం అనేది గుణంలో ఉందని ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రేమమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని మొదట తాను భావించలేదని సాయిపల్లవి తెలిపారు. తాను సినిమాలలో నటించే రోల్స్ ప్రేక్షకులకు నచ్చాలని భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి ఆడపడుచుగా భావించడం సంతోషాన్ని కలిగిస్తోందని సాయిపల్లవి కామెంట్లు చేస్తున్నారు.
మంచి కథలు వస్తే భాషతో సంబంధం లేకుండా నటిస్తానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను సినిమాల్లో కొనసాగుతానని సాయిపల్లవి స్పష్టం చేయడం గమనార్హం. సాయిపల్లవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆమెకు ఒకింత మైనస్ అవుతోంది.
చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ఈ హీరోయిన్ పరిమితంగానే రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. సాయిపల్లవికి ఛాన్స్ ఇచ్చే దర్శకనిర్మాతలు ఎవరో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. సాయిపల్లవి కెరీర్ పరంగా ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.