సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్.
ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!