Sai Tej: ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చిన సాయితేజ్.. పవన్ అలా చెప్పారంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా తొలిరోజే ఏకంగా 23 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. సాధారణ టికెట్ రేట్లతో సైతం పవన్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టామినాకు ఇదే నిదర్శనం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ పై ప్రముఖ పార్టీ నేతలు తరచూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ పై చేసే విమర్శల గురించి సాయితేజ్ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. విరూపాక్ష, బ్రో సినిమాలతో సాయితేజ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు. త్వరలో (Sai Tej) సాయితేజ్ నటించిన షార్ట్ ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

సీనియర్ నరేష్ కొడుకు నవీన్ డైరెక్షన్ లో ఈ ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కిందని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి నటించాలని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సాయితేజ్ పేర్కొన్నారు. పవన్ పై వస్తున్న విమర్శల గురించి సాయితేజ్ స్పందిస్తూ మా మామయ్యను అంటే నాకు చాలా బాధగా ఉంటుందని సాయితేజ్ తెలిపారు. నాపై చాలా విమర్శలు వస్తాయని వాటి గురించి రియాక్ట్ కావద్దని మామయ్య చెప్పారని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

మిడిమిడి జ్ఞానంతో రాజకీయాల్లోకి రావద్దని, విమర్శల గురించి పట్టించుకోవద్దని పవన్ మామయ్య చెప్పారని సాయితేజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం నచ్చిన అమ్మాయిలు సైతం బ్రో అని పిలుస్తున్నారని సాయితేజ్ పేర్కొన్నారు. సాయితేజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం సాయితేజ్ కు సక్సెస్ అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus