Saif, Kareena: ఏంటి వారిద్దరి మధ్య అంత పని జరిగిందా? విడాకులకు కారణం అదేనా?

ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడంతో విడాకుల బాట పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక విషయంలోకి వెళ్తే.. సైఫ్ అలీ ఖాన్ మొదట్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి కరీనాకపూర్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరి పెళ్లి అప్పట్లో ఇండియాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇద్దరు బాబులకు కూడా జన్మనిచ్చారు. ఇక తన ఇద్దరు కొడుకుల పేర్లు తైమూర్,జహంగీర్ అని పెట్టి కరీనా కపూర్ దంపతులు వివాదాల్లో ఇరుక్కున్నారు.ఈ విషయం పక్కన పెడితే..ప్రస్తుతం ఈ ఇద్దరు తమ సినీ కేరీర్ లో చాలా బిజీ బిజీగా ఉన్నారు.అలాంటిది తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో వీరి అభిమానులంతా ఇదేంటి..

విడాకులు తీసుకోవడం ఏంటి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్,సినీ క్రిటిక్ ఉమైర్ సందు.. ఉమైర్ సందు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకోచ్చారు.. నిన్న రాత్రి కరీనా కపూర్ కి తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో తీవ్రమైన గొడవ జరిగింది.

ఆ గొడవలో కరీనాకపూర్ తన (Saif) భర్త మొహంపై దారుణంగా దాడి చేసింది.. ఇక వారి గొడవ పెద్దగానే జరిగింది. కానీ ఇప్పుడు వారి మధ్య జరిగిన పెద్ద గొడవ గురించి నేను బయట పెట్టాలనుకోవడం లేదు అంటూ ఉమైర్ సందు తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో ఇందులో నిజం ఎంత అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus