గతేడాది ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోని సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా ఆయన లుక్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆదిపురుష్ విడుదలైన ఏడు నెలల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేదాన్ని నేను బలంగా నమ్ముతానని సైఫ్ తెలిపారు.
నన్ను నేను స్టార్ అని ఎప్పుడూ ఫీల్ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. నా తల్లీదండ్రులు స్టార్స్ అయినా వాళ్లు సింప్లిసిటీకే ఓటు వేసేవారని సైఫ్ వెల్లడించారు. నేను కూడా రియాలిటీలోనే బ్రతకాలని అనుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఓటమి గురించి నేను భయపడిపోనని సైఫ్ పేర్కొన్నారు. ఆదిపురుష్ సినిమానే ఇందుకు ఉదాహరణగా తీసుకుందామని కామెంట్లు చేశారు.
కొన్నిసార్లు రిస్క్ చేయాలని ఓటమిని తీసుకోవాలని లైఫ్ అన్న తర్వాత అన్నీ ఉండాలని ఓటమి వచ్చిందని బాధ పడి ముడుచుకుపోకూడదని సైఫ్ వెల్లడించారు. మనం మన వంతు కష్టపడాలని ఆదిపురుష్ మూవీ దురదృష్టం కొద్దీ వర్కౌట్ కాలేదని ఆయన అన్నారు. తర్వాత సినిమా చూసుకుందామనే ధైర్యంతో కెరీర్ పరంగా ముందుకు సాగాలని సైఫ్ అలీ ఖాన్ పేర్కొన్నారు. నేను అదే అని చేశానని ఆయన వెల్లడించారు.
సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవరలోసైఫ్ అలీ ఖాన్ తన యాక్టింగ్ స్కిల్స్ తో విలన్ గా ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. సైఫ్ అలీ ఖాన్ రెమ్యునరేషన్ 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.