Adipurush: ఆదిపురుష్ మూవీపై రావణ్ ఏమన్నారంటే?

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆదిపురుష్ ఓటీటీలో రిలీజ్ కానుందని గాసిప్స్ ప్రచారంలోకి రాగా సైఫ్ అలీ ఖాన్ ఆ వార్తలకు చెక్ పెట్టారు.

ఆదిపురుష్ సినిమా చిన్నచిన్న స్క్రీన్స్ లో చూసే సినిమా కాదని ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం లేదని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఆదిపురుష్ మూవీ గ్రాండ్ గా తెరకెక్కుతోందని దర్శకుడు ఓంరౌత్ సిల్వర్ స్క్రీన్ పై చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని సైఫ్ అలీఖాన్ అన్నారు. ఆదిపురుష్ లో సాలిడ్ విజువల్స్ ఉన్నాయని థియేటర్లలో చూసి మాత్రమే ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్స్ కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని తెలుస్తోంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో కృతిసనన్ నటిస్తున్నారు. ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus