Saif Ali Khan: అనుకున్న సమాయానికి ‘దేవర’ వస్తాడా? వరుస బ్రేకులతో సాధ్యమేనా?

అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ కాకపోతే చాలా సినిమాలు డిస్ట్రబ్‌ అవుతాయి. అందులోనూ ఆ సినిమా స్టార్‌ హీరోది, భారీ బడ్జెట్‌ది అయితే ఇంకా కష్టం. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే… టాలీవుడ్‌లో చాలా రోజులుగా వినిపిస్తున్న ఓ సినిమా రిలీజ్‌ వాయిదా పుకారు నిజమయ్యేలా ఉంది కాబట్టి. ఆ పుకారు వచ్చింది ‘దేవర’ గురించే. వివిధ కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నారు అని గత కొన్ని రోజులుగా అంటున్నారు. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అంటున్నారు.

ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. రెండు పార్టులుగా రిలీజ్‌ కానున్న ఈ సినిమా తొలి పార్టను ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేస్తామని చాలా నెలల క్రితమే టీమ్‌ ప్రకటించింది. అయితే ఇటీవల సినిమా షూటింగ్‌కు వాయిదాలు పెరిగాయని, అందుకే ఆ డేట్‌కి కష్టం అని పుకార్లు వచ్చాయి. అయితే సన్నిహిత వర్గాలు మాత్రం సినిమా అనుకున్న సమయానికి వచ్చేస్తుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ‘దేవర’ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు.

గతంలో చేతికి గాయమైన సైఫ్‌ అలీ ఖాన్‌… ఇప్పుడు ‘దేవర’ సెట్స్‌లో మళ్లీ గాయపడ్డాడు అంటున్నారు. సినిమాలో కీలక యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా చిన్నపాటి గాయమైందని, అయితే ఈ నేపథ్యంలో పాత గాయం తిరగబెట్టడంతో సర్జరీ అవసరమైందని చెప్పారు. ఇటీవల హాస్పిటల్‌లో చేరిన సైఫ్ అలీ ఖాన్‌… సర్జరీ తర్వాత మంగళవారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. భార్య కరీనా కపూర్ వెంట రాగా చేతికి కట్టుతో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు.

ఆ కట్టు చూస్తుంటే ఇంత త్వరగా సైఫ్‌ (Saif Ali Khan) షూటింగ్‌కి వచ్చేలా లేడు అని అంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా ‘దేవర 1’ రిలీజ్‌ డేట్ విషయంలో మార్పులు పక్కా అంటున్నారు. ఆ లెక్కన ఆ సినిమా పక్కకు జరిగితే మరికొన్ని చిన్న సినిమాలు ఆ డేట్‌కి వచ్చేస్తారు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus