Saif Ali Khan: ఎన్టీఆర్ సినిమాలో విలన్ పాత్ర కోసం సైఫ్ ఎంత పారితోషికం అందుకుంటున్నాడు అంటే..!

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం.. నార్త్ ఆడియన్స్ ను గట్టిగానే టార్గెట్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, నార్త్ మార్కెట్ కీలకంగా మారింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఓవర్సీస్ లో అతనికి మంచి మార్కెట్ ఉంది. నార్త్ లో కూడా మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి.. ‘ఎన్టీఆర్ 30’ లో బాలీవుడ్ స్టార్స్ ను కూడా దింపుతున్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంపికైంది. ఈ మధ్యనే ఆమె హైదరాబాద్ వచ్చి మరీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంది.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో (Saif Ali Khan) సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిని నిజం చేస్తూ లేటెస్ట్ షెడ్యూల్ లో సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ – జాన్వీ- సైఫ్ అలీఖాన్ కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ తో దిగిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్ర బృందం.

ఇక ఈ చిత్రం కోసం సైఫ్ అలీ ఖాన్ ఎంత పారితోషికం అందుకుంటున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కు రూ.15 కోట్లు అలాగే జీఎస్టీని పారితోషికంగా చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. సైఫ్ అలీఖాన్ బాలీవుడ్లో ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న స్టార్ హీరో. అతనికి ఇది మంచి ఆఫరే. అలాగే అతని వల్ల బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ 30 కి మంచి మార్కెట్ ఏర్పడుతుంది. థియేట్రికల్ గానే కాకుండా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ఎక్కువ రేటుకు వెళ్తాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus