నేచురల్ స్టార్ నాని (Nani) మరో రెండు రోజుల్లో ‘హిట్ 3’ (HIT 3) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలేష్ కొలను (Sailesh Kolanu) దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయబోతున్నాడు. వాస్తవానికి ‘హిట్ 3’ కంటే ముందు శ్రీకాంత్ ప్రాజెక్టు మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. అందుకే నాని వెంటనే ‘హిట్ 3’ కంప్లీట్ చేశాడు. ఇక శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి ‘ది పారడైజ్’ (The Paradise) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
అందులో భయంకరమైన వయొలెన్స్ ఉంటుంది అని చిత్ర బృందం ముందుగానే వెల్లడించింది. గ్లింప్స్ ద్వారా కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది.నాన్ స్టాప్ బూతులతో నాని ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అని కూడా గ్లింప్స్ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా..’ది పారడైజ్’ ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అందుకోసమే సినిమాలో పాన్ ఇండియా నటీనటులను తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో నానిని ఢీకొట్టే విలన్ గా రాఘవ్ జుయల్ (Raghav Juyal) ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. హిందీలో సూపర్ హిట్ అయిన ‘కిల్’ సినిమాలో రాఘవ్ విలన్‌గా నటించాడు. అంతకు ముందు చిన్న చితక పాత్రలు చేసినా… ‘కిల్’ సినిమాతోనే ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. ‘ది పారడైజ్’ వంటి యాక్షన్ సినిమాకి ఇతను కరెక్ట్ గా సరిపోతాడు అని భావించి రాఘవ్ ని ‘ది పారడైజ్’ టీం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.