Saina Nehwal,Siddharth : సిద్ధార్థ్-సైనా వివాదం.. ముగిసినట్లేనా..?

సినీ నటుడు సిద్ధార్థ్ తనకు క్షమాపణలు చెప్పడంపై భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరడం సంతోషకరమని.. అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఏదేమైనా.. సిద్ధార్థ్ ను ఆ దేవుడు చల్లగా చూడాలని తన హుందాతనాన్ని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

దీనిపై సిద్ధార్థ్ రియాక్ట్ అవుతూ.. అభ్యంతరకర అర్ధం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహిళను కించపరుస్తూ సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌, భర్త పారుపల్లి కశ్యప్‌ లు సిద్ధార్థ్ తీరును ఖండించారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సిద్ధార్థ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫైనల్ గా సైనాను క్షమాపణలు కోరుతూ ఓ లెటర్ పోస్ట్ చేశారు. ‘నువ్ ఎప్పటికీ నా ఛాంపియన్‌వే’ అంటూ ట్వీట్ వేశాడు.

ఈ లేఖపై స్పందించిన సైనా.. మీడియాతో మాట్లాడుతూ.. మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడని చెప్పారు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. నిజానికి తన పేరు ట్విటర్‌లో ట్రెండ్‌ అవడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అప్పుడే అతడు తన గురించి ఏం రాశాడో తెలిసిందని.. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలంటూ చెప్పుకొచ్చారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus